
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. గత నాలుగు నెలల కాలంలో ఎవరూ ఊహించని విధంగా నిన్న ఒక్క రోజునే వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్ ల సంఖ్యను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.
దగ్గు , జలుబు , జ్వరం , ఒళ్ళు నొప్పులు తదితర లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలని , సొంత వైద్యం చేసుకోవడాన్ని తప్పుపట్టింది. యాంటీ బయోటిక్స్ కూడా ఎక్కువగా వాడొద్దని , డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలని సూచించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా శనివారం రోజున 1071 కరోనా కేసులు నమోదయ్యాయి.