భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. దాంతో తనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతిని వేడుకుంది జి. పుల్లారెడ్డి స్వీట్స్ సంస్థల యజమాని రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ్యా రెడ్డి. గతకొంత కాలంగా ప్రజ్జ్య కు రాఘవరెడ్డి కుటుంబానికి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తనను ఇంట్లో బంధించి గోడ కట్టారని , అలాగే వరకట్న వేధింపులతో ఇబ్బంది పెడుతున్నారని , చంపడానికి ప్రయత్నాలు చేసారని , నాకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతిని వేడుకుంది.
ఈనెల 29 న షేక్ పేటలోని జి. నారాయణమ్మ కాలేజ్ లో రాష్ట్రపతి పర్యటన ఉన్న నేపథ్యంలో మీరు పర్యటించిన తర్వాత దాన్ని అవకాశంగా చేసుకొని దర్యాప్తు సంస్థలపై మరింత ప్రభావం చూపించేలా చేస్తారని , అందుకే సాటి మహిళగా నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను అంటూ ఈ మెయిల్ చేసింది ప్రజ్ఞ.