ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇంతకుముందు ఢిల్లీ ఎమ్మెల్యే నెల జీతం 54 వేలు మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు పెంచిన జీతంతో మొత్తంగా నెలకు ఒక్కో ఎమ్మెల్యే 90 వేల జీతం అందుకోనున్నాడు. ఈమేరకు భారీగా పెంచిన జీతాల గురించి సదరు ఎమ్మెల్యేలకు తెలియజేయడంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు.
అయితే ఇదే సమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి కేజ్రీవాల్ ప్రభుత్వంపై. ఎమ్మెల్యేల జీతాలు హుటాహుటిన ఇంత భారీగా పెంచడం ఏంటి ? అని . ఈ విమర్శలకు కూడా గట్టిగానే సమాధానం చెబుతున్నారు ఆప్ ఎమ్మెల్యేలు. భారీగా పెంచిన మాట వాస్తవమే కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇది పెద్ద మొత్తం కాదని ఉదాహరణలు కోకొల్లలుగా చెబుతున్నారు. అందులో మొదటగా చెప్పే రాష్ట్రం పేరు తెలంగాణదే మరి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేల జీతాలు ఎక్కువ అలాగే ప్రధాన మంత్రి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి నెల జీతం ఎక్కువ మరి .