ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి స్కూల్ విద్యార్థులపై చెరగని ముద్ర వేసిన నాయకుడు మనీష్ సిసోడియా. దాంతో తమ ప్రియతమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలని ఢిల్లీలోని స్టూడెంట్స్ హంగర్ స్ట్రైక్ కు సిద్దమౌతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా పలు పాఠశాలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాలకు వెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తుండటంతో , తిండి లేకుండా పస్తులు ఉండటంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే మనీష్ సిసోడియా ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గా పని చేసిన మనీష్ సిసోడియా ఢిల్లీ లోని పాఠశాలలను పూర్తిగా మార్చేశారు. పేరుకు ప్రభుత్వ పాఠశాలలు అయినప్పటికీ వాటిని చూస్తే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా విప్లవాత్మక మార్పులు చేసాడు సిసోడియా. దాంతో సిసోడియా అరెస్ట్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. వాళ్ళతో పాటుగా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు కూడా సిసోడియా అరెస్ట్ అక్రమమని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మనీష్ సిసోడియా ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.