
కేరళలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే పాటించే పద్దతిలో మిగతా ఆలయాలకు భిన్నంగా ఉంటుంది కేరళ లోని కొచ్చిన్ తిరుమల దేవస్థానం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ సమయంలో స్వామి వారిని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఆ వేడుకను చూసిన కనులు పండగ ……. చూడని కనులు దండగ అన్నట్లుగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అన్ని ఆచార వ్యవహారాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ నభూతో నభవిష్యత్ అనే రీతిలో స్వామి వారిని కొలుస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళామణులు కూడా పాల్గొంటారు. స్వామి వారికి విశేష పూజల అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. సహపంక్తి భోజనం చేస్తారు. ఈ కనుల విందైన కార్యక్రమాన్ని చూడలేని వారు …… స్వామి వారికి జరిగిన విశేష పూజా కార్యక్రమాల వీడియో చూసి తరించండి.