OYO Rooms: యంగ్ జనరేషన్ లో చాలా మందికి OYO (ఓయో) పేరు తెలిసే ఉంటుంది. అసలు ఒయో పెట్టిన కాన్సెప్ట్ వేరు నేడు ఓయో కొనసాగుతున్న తీరు వేరు. కొందరు దీన్ని పక్కదారి పట్టించారు. ఇక పెద్దవారికి ఈ పేరంటే జంకు మొదలవుతుంది. ఎందుకంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా దీన్నే వినియోగిస్తుండడంతో పేరు తొందరగా బయటకు వచ్చింది. అసలు ఓయో కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు పెట్టారో తెలుసా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హోటల్స్ బిజినెస్ లో ఓయో ఒకటి. నేడు బుద్ధి వచ్చిన పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఓయో గురించి తెలుసు. తక్కువ ధరలోనే ఇందులో రూమ్స్ అవెలబుల్ ఉంటాయి. సాధారణంగా ఇతర హోటళ్లలో రూమ్ బుక్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్. అదే ఓయోలో అయితే బుక్ చేసుకునేందుకు ఎక్కువ డాక్యుమెంట్ అవసరం ఉండదు. అందుకే ఎక్కువ మంది దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనికి తోడు టూర్లకు వెళ్లిన వారు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లేలోగానే రూములను బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణాల మధ్యలో ఓయోలో బస చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఓయో అంటే అర్థం ఏంటి? దాన్ని ఎందుకు తెచ్చారు లాంటి విషయం చాలా మందికి తెలియదు. OYO ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఓయోను ప్రారంభించినప్పుడు దానికి ‘ఒరవల్’ అని పేరు పెట్టారు. కానీ 2013లో దాని పేరు ‘OYO రూమ్స్’గా మార్చారు. ఈ OYO పూర్తి పేరు ‘ఆన్ యువర్ ఓన్’. ఓయో రూమ్ బుక్ చేసుకున్న వారు దాన్ని సొంత రూమ్ లెక్క భావించాలనే దీనికి ఓయో అనే పేరు పెట్టారు.