ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రక్షాబంధన్ కోసం పడవ ప్రయాణం చేస్తున్న వారిలో 20 మంది మరణించారు. దాంతో ఈ వార్త సంచలనంగా మారింది. బాందా జిల్లాలోని యమునా నదిలో ఈ పడవ మునక జరిగింది. పడవలో ఆ సమయంలో 50 మందికి పైగా ప్రయాణం చేస్తుండగా అందులో 20 మంది మరణించారు.
పడవలో ప్రయాణిస్తున్న వాళ్లంతా మార్కా గ్రామం నుండి ఫతేపూర్ కు రక్షాబంధన్ కోసం వెళ్తున్నారు. వరదల ప్రభావంతో యమునా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పడవ ప్రమాదం జరిగింది. 20 మంది మరణించగా మిగతా వాళ్ళ కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టింది యోగి ప్రభుత్వం.