
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ (80 ) తుదిశ్వాస విడిచారు. 1943 లో జన్మించిన ముషార్రఫ్ అంచెలంచెలుగా పాకిస్థాన్ సైనికధికారిగా ఎదిగాడు. అయితే 1999 లో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారం చేపట్టాడు. మొత్తంగా పాక్ అధ్యక్షుడు గా 2008 వరకు కొనసాగాడు. అయితే అభిశంసన ఎదుర్కొనే ముందు తన పదవికి రాజీనామా చేసి దుబాయ్ పారిపోయాడు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషార్రఫ్ ఈరోజు దుబాయ్ లో మరణించాడు.






