భారత ఓపెనర్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు దాంతో భారత్ 349 పరుగులను చేయగలిగింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 18 న జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ – న్యూజిలాండ్ లు తలపడిన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో గిల్ వీరవిహారం చేసాడు …. వన్ మ్యాన్ షోగా సాగిందనే చెప్పాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రోహిత్ సేన. మిగతా ఆటగాళ్లందరూ స్వల్ప స్కోరుకు పరిమితం కాగా శుభమన్ గిల్ మాత్రం డబుల్ సెంచరీతో ప్రేక్షకులకు కనువిందు చేసాడు. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఎవరైనా నెమ్మదిగా ఆచి తూచి ఆడతారు కానీ గిల్ మాత్రం వరుసగా మూడు సిక్సర్ లతో చెలరేగి డబుల్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. 350 పరుగుల విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగింది.