భారతదేశంలో కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. ఇటీవల కాలంలో కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇంకా ఆ మహమ్మారి తగ్గుముఖం పట్టలేదు కానీ ప్రజలు మాత్రం దాన్నుండి తేరుకున్నారు. హమ్మయ్య అని అనుకునేలోపు మరో కొత్త వైరస్ భారత్ లో దడ పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్ పేరు ఏంటో తెలుసా ……. H3N2. ఇది కరోనా మహమ్మారి లాంటి ప్రమాదకారి కాదు కానీ ఈ వైరస్ వల్ల ఎక్కువగా పిల్లలు , వృద్దులు బాధపడే అవకాశం ఉందని , అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ICMR హెచ్చరించింది.
దేశంలో గత వారం , పది రోజులుగా దగ్గు , జలుబు , జ్వరం లతో బాధపడుతూ ఆసుపత్రులకు వస్తున్నారని , ఇది త్వరగా వ్యాపించే లక్షణం ఉన్నటువంటి జబ్బు కావడంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి అని అంటున్నారు. ఈ వ్యాధి తీవ్రత తగ్గించాలంటే జనసంచారాల్లో తిరగకపోవడం మంచిదని , అలాగే తిరగాల్సి వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలని హెచ్చరిస్తున్నారు. యాంటీ బయోటిక్స్ ఇష్టానుసారం వాడొద్దని ఐసిఎమ్మార్ హెచ్చరించింది.