ఇప్పుడు ఎక్కడ విన్నా H3N2 virus గురించే టాపిక్. వందేళ్ల క్రితం నాటి వైరస్ అని మొదటి ప్రపంచ యుద్ధం నాటి వైరస్ అంటూ చెప్పుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే ఇది అప్పట్లో ప్రమాదకారి అయినప్పటికీ ఇప్పుడు దాని తీవ్రత తగ్గిందని , దీనికి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు డాక్టర్లు.
అయితే తేలికగా తీసుకోకుండా ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అంటున్నారు. సాధారణంగా దగ్గు , జలుబు , జ్వరం వచ్చినట్లే ఈ వైరస్ వల్ల కూడా వస్తాయని , అప్పుడు భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అసలు H3N2 వైరస్ జనవరిలోనే వచ్చిందని కానీ దాన్ని ఇప్పుడు గుర్తించారని , వైరస్ వచ్చిందని భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోలుకోవడం ఖాయమని సలహా ఇస్తున్నారు.
కాస్త గోరు వెచ్చని నీళ్లు తాగడం , అలాగే గోరు వెచ్చని నీళ్లు పుక్కిలించి ఉమ్మి వేయడం ద్వారా త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు. మాస్క్ తప్పనిసరి …… ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల్లో తిరగకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు వైద్యులు. విష ప్రచారాలు నమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదే పది వేలని అంటున్నారు డాక్టర్లు.