
Modi shows : కర్ణాటక ఫలితాలు భారతీయ జనతా పార్టీ వెన్నులో వణుకుపుట్టించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ సారి ప్రభుత్వంలో మార్పు కోరుకుంటారు కన్నడిగులు. ఈ విషయం తెలిసినా బీజేపీ అగ్రనాయకత్వం బలంగా పోరాడింది. ఈ సారి కూడా బీజేపీనే గెలిపించుకొని కన్నడిగులను పూర్తిగా బీజేపీ వైపు మళ్లించుకోవాలని అనుకుంది. ఇది దక్షిణాదిన తమ పార్టీకి మంచి అరంగేట్రం అని అనుకుంది. బహూషా ఇదే వారి చేసిన తప్పిదం కావచ్చేమో..! ప్రభుత్వ బదలాయింపు అతి తెలిసినా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా మొదటి నుంచి కర్ణాటకలో ఉండి ప్రచారం నిర్వహించారు.
బీజేపీ అగ్రనాయకత్వం ఇంత కష్టపడినా ఓటమి పాలైంది. అదీ ఎంతలా అంటే పొత్తు పెట్టుకున్నా పార్టీని ప్రభుత్వంలోకి తేలేనంతగా. దీంతో దక్షిణాదిన మరింత చులకన అయ్యింది. కర్ణాటక తర్వాత దక్షిణాదిన తెలంగాణలో కూడా ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో మంచి ఊపుమీదున్న బీజేపీ పార్టీ ఆశలపై నీళ్లు చల్లినట్లు కనిపిస్తుంది. ఇది మొదటి నుంచి తెలిసిన ఫలితమే అయినా కన్నడ నాట కాంగ్రెస్ భారీ స్థాయిలో విజయం సాధించడం తెలంగాణలో కాంగ్రెస్ మంచి ఊపుమీదున్నది.
అయితే కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. కేరళలో ఇటీవల ‘ది కశ్మీర్ స్టోరీ’ రిలీజైంది. మొదటి నుంచి కేరళలో ఈ సినిమాను ఆడనిచ్చేది లేదని అక్కడ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇదే అంశాన్ని కర్ణాటక ఎన్నికల్లో ప్రచార హస్ర్తంగా మార్చుకుంది బీజేపీ. ఉగ్రవాదులతో సంబంధాలు లేకుంటే ఈ సినిమాను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ ను దృష్టిలో ఉంచుకొని విమర్శలకు దిగింది. ఈ ప్రచారం కూడా బీజేపీకి కలిసి రాలేదు. పైగా కాంగ్రెస్ దీన్ని కూడా మత విశ్వాసాలలో బీజేపీ చిచ్చు పెడుతుందని ప్రతి విమర్శలకు దిగింది. బీజేపీ వారికి ది కేరళ స్టోరీ చూపెడతాం అనుకుంటే వరే బీజేపీ అగ్రనాయకత్వానికి కర్ణాటక సినిమా చూపెట్టారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంది. బీజేపీపై వింత వింత సెటైర్లకుదిగుతుంది.