Gold Holdings : ప్రపంచంలోనే అత్యధిక సంపన్న దేశం అమెరికా. ఆ అమెరికా డాలర్ తోనే ప్రపంచ వర్తకం నడుస్తోంది. అయితే ప్రపంచమంతా అమెరికా డాలర్ పనిచేసినా ఆ దేశం వద్ద అత్యంత విలువైన బంగారం మాత్రం లేదు. మన భారత్ తో పోలిస్తే ఇటు చైనా వద్ద.. అటు అమెరికా వద్ద అసలు బంగారం లేదు.
భారతీయులకు బంగారం అంటే ప్రాణం. మెడలో, చెవులు, ముక్కులు, చేతులు కాళ్లు ఇలా అంతటా ధరించేస్తారు. అదొక సంప్రదాయంగా వస్తోంది. అందుకే అమెరికా, చైనా వంటి అగ్రదేశాలకు మించి మన దగ్గర బంగారం ఉంది. భారతదేశంలో కేవలం ప్రైవేట్ వ్యాపారులు, ప్రజల వద్ద ఉన్న బంగారమే చైనా, అమెరికాలను మించి ఉంది.
భారత్ లో ప్రైవేటు రంగంలో ఉన్న బంగారం విలువనే 23000 టన్నులుగా ఉంది. ఇదే సమయంలో చైనా దేశంలో ఉన్న బంగారం కేవలం 16000 టన్నులు మాత్రమే. ఇదే అమెరికాలో అయితే కేవలం 8100 టన్నులు మాత్రమే ఉంది.
టెక్నాలజీ, సంపద, అభివృద్ధి, డాలర్ల వేటలో అమెరికా, చైనా ముందున్నా.. బంగారంలో మాత్రం భారతీయుల దరిదాపుల్లో ఈ దేశాలు లేవంటే అతిశయోక్తి కాదు.