జాతీయ మహిళా టీమ్ సంచలనం సృష్టించింది. FIH Women’s Nations Cup – 2022 కోసం భారత జాతీయ మహిళా హాకీ టీమ్ స్పెయిన్ ను 1-0 ఫైనల్ మ్యాచ్ లో ఓడించింది. స్పెయిన్ లోని వెలన్సీయా లో ఈ మ్యాచ్ జరుగగా భారత్ జయకేతనం ఎగురవేసింది. స్పెయిన్ పై సాధించిన విజయంతో టైటిల్ సొంతం చేసుకుంది భారత్ . ఇక ఈ విజయంతో 2023 -24 FIH విమెన్స్ ప్రో లీగ్ కు అర్హత సాధించింది.
భారత మహిళా హాకీ టీమ్ లో గుర్జీత్ కౌర్ ఫైనల్ గోల్ చేయడంతో భారత్ ను విజయం వరించింది దాంతో గుర్జీత్ కౌర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హాకీ జట్టు సంచలన విజయం సాధించడంతో హాకీ టీమ్ లోని ప్రతీ సభ్యురాలికి 2 లక్షల చొప్పున నగదు పురస్కారంతో సత్కరించనుంది హాకీ బోర్డు . అలాగే మహిళా క్రీడాకారులకు సహాయ సహకారాలు అందించిన ఇతర సిబ్బందికి లక్ష చొప్పున ఇవ్వనున్నారు.