
అమెరికా లోని పాక్ కాన్సులేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు భారతీయులు. 2008 నవంబర్ 26 న జరిగిన సంఘటన యావత్ భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. భారత వాణిజ్య రాజధాని అయిన ముంబై పై పాక్ ఉగ్రమూకలు సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. దాదాపు మూడు రోజుల పాటు నరమేధం జరిగింది. ఆ సంఘటనను మర్చిపోలేరు భారతీయులు ……. అంతగా ఆ సంఘటన గాయాన్ని చేసింది.
దాంతో నవంబర్ 26 న అమెరికాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపారు పలువురు భారతీయులు. ఇప్పటకైనా పాకిస్థాన్ తమ పద్ధతి మార్చుకోవాలని , శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దిశగా సాగాలని , కానీ భారత్ అంటే మండిపడుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని దుయ్యబట్టారు పలువురు ప్రవాసాంధ్రులు.