
కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లెయిర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ – తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాయి. పోర్ట్ బ్లెయిర్ ప్రజలు టీడీపీ – బీజేపీ కూటమికి విజయాన్ని కట్టబెట్టారు. దాంతో బీజేపీ – టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
పోర్ట్ బ్లెయిర్ లో విజయం సాధించిన టీడీపీ – బీజేపీ కూటమికి శుభాకాంక్షలు. మీ కృషికి , అంకితభావానికి ప్రజలు మద్దతు ఇచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారనేందుకు ఈ ఎన్నికలు నిదర్శనం అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీ – బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం తీవ్ర విభేదాలతో విడిపోయి నష్టపోయాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో కూడా బీజేపీ – టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జేపీ నడ్డా ట్వీట్ మరింత సంచలనంగా మారింది.