స్నేహమేరా అసలైన జీవితం అంటూ తన పంథాను కొనసాగిస్తున్నాడు కేరళ మంత్రి కె. రాజన్. ముఖ్యమంత్రి పినరయి కేబినెట్ లో నాలుగు కీలక శాఖలను నిర్వహిస్తున్నాడు రాజన్. రెవిన్యూ , భూసంస్కరణలు , కేరళ హౌజింగ్ తదితర కీలక శాఖలను నిర్వహిస్తున్న రాజన్ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నాడు. గత ప్రభుత్వం లో ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహించడంతో ఈసారి ప్రమోషన్ లభించింది. దాంతో కీలక నాలుగు శాఖలను ముఖ్యమంత్రి అప్పగించాడు.
అయితే కీలక నాలుగు శాఖలను నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ , తన స్నేహితులతో ఇట్టే కలిసి పోతుంటాడు. అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ తన స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు. తన మిత్రులకు కొంత సమయం కేటాయిస్తూ స్నేహానికి విలువ ఇస్తున్నాడు. తాజాగా కేరళ లోని ఓ సాధారణ టీ కొట్టులో తన స్నేహితులతో కలిసి లయబద్దంగా పాటలు పాడుతూ సందడి చేసాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజుల్లో చాలామంది ఉన్నత పదవులు పొంది హోదా పెరగగానే స్నేహితులను మర్చిపోతుంటారు…… నిర్లక్ష్యం చేస్తుంటారు కానీ రాజన్ మాత్రం స్నేహమేరా జీవితం అంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.