ఏపీలో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఢిల్లి నుంచి పిలుపు వచ్చింది. శ్రీలక్ష్మితో పాటుగా ఎంపిక చేసిన కొందరు ఐఏఎస్ లను ఢిల్లీకి రావాల్సిందిగా డీవోపీటీ సూచించింది. ఇదే లాస్ట్ ఛాన్స్ గా పేర్కొంది. సివిల్స్ అధికారులకు మిడ్ కెరీర్ ట్రైనింగ్ కు డీవోపీటీ సిద్ధమైంది. సీనియర్ ఐఏఎస్ లు ఈ శిక్షణకు హాజరైతేనే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి డీవోపీటీ అనుమతిస్తుంది. వారికే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు డీఓపీటీ అనుమతిస్తుంది. వీరికి దరఖాస్తు చేసుకోవానికి డీఓపీటీ సమయం డిసైడ్ చేసింది.
శ్రీలక్ష్మీతో సహా పలువురు ఐఏఎస్ లకు డీఓపీటి నుంచి తాజాగా ఈ మేరకు ఆదేశాలు అందాయి. మిడ్ కెరీర్ ట్రైనింగ్ కు హాజరు కావాలంటూ 404 మంది అధికారులకు ఈ సర్క్యులర్ జారీ అయింది. ఈసారి 1994, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరితోపాటు 1994 బ్యాచ్ కంటే ముందు సర్వీసులోకి వచ్చిన కొంత మంది సీనియర్ ఐఏఎ్‌సలు ఇప్పటికీ మిడ్ కెరీర్ ట్రైనింగ్ పూర్తి చేయలేదు. దీంతో వారికి కూడా చివరిగా ఐదోసారి అవకాశం కల్పించారు.
అలాంటివారు దేశ వ్యాప్తంగా 251 మంది ఉన్నారు. ఏపీ నుంచి ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మీతో పాటుగా జి.అనంతరాము(1990), ఆర్‌పీ సిసోడియా(1991), జి.సాయిప్రసాద్(1991), అజయ్ జైన్(1991), ఎంటీ కృష్ణబాబు(1993), అనిల్‌కుమార్ సింఘాల్(1993) లకు డీవోపీటీ చివరి అవకాశం కల్పించింది.
1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల్లో ఏపీలో పని చేస్తున్న ఎ.వాణీప్రసాద్, జి.జయలక్ష్మి, లవ్ అగర్వాల్(1996), శశిభూషణ్‌కుమార్(1996), ముద్దాడ రవిచంద్ర(1996), కె. సునీత(1996)లకు ట్రైనింగ్‌కు అవకాశం కల్పించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 నుంచి 28వ తేదీ వరకు ముస్సోరీలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్పటికీ ఇబ్బంది అయితే మార్చి 13వ తేదీ వరకు డీవోపీటీ అవకాశం కల్పించింది. ఏప్రిల్ 9వ తేదీ నాటికి శిక్షణకు వచ్చే సీనియర్ ఐఏఎ్‌సలు అకాడమీలో రిపోర్టు చేయాల్సిందిగా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ అధికారుల్లో ప్రస్తుతం ఏపీ నుంచి శ్రీలక్ష్మి సీనియర్ అధికారిగా ఉన్నారు. 2026 వరకు శ్రీలక్ష్మి సర్వీసులో ఉండనున్నారు. వైసీపీ ప్రభుత్వం 2024లో తిరిగి అధికారంలోకి వస్తే శ్రీలక్ష్మి ఏపీలో సీఎస్ అవుతారే ప్రచారం ఇప్పటికే ఏపీ ప్రభుత్వ అధికార వర్గాల్లో వినిపిస్తోంది