
నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో 8 మంది మరణించడంతో ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి చెందారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున నష్టపరిహారం, గాయపడిన వాళ్లకు 50 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కందుకూరు రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా ఆ రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జనాలు భారీగా తరలి రావడం , చంద్రబాబు ను దగ్గరగా చూడాలనే ఆతృతలో ఈ తొక్కిసలాట జరిగింది. దాంతో ఆ ఘటనలో 8 మంది మరణించగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.