భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టాడు. భారతదేశంలోని అత్యంత పురాతనమైన , అత్యంత విశిష్టమైన దేవతల విగ్రహాలను కొంతమంది దొంగిలించి విదేశాలకు తరలించారు. ఆ విగ్రహాలను తిరిగి భారత్ కు రప్పించే గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు మోడీ. హిందూ దేశమైన భారత్ లో అత్యంత ప్రాచీనమైన దేవతా విగ్రహాలు కోకొల్లలు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా మారిన భారత్ లో అత్యంత విలువైన విగ్రహాలను దొంగిలించి వాటిని విదేశాలకు అమ్ముకున్నారు కొంతమంది దేశ ద్రోహులు.
దేశ వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాలలో ఉన్న విగ్రహాల ప్రాశస్త్యం తెలుసుకున్న నొటోరియస్ క్రిమినల్ సుభాష్ కపూర్ ఇక్కడి దేశ ద్రోహులకు డబ్బు ఆశ చూపించి ఆ విగ్రహాలను సొంతం చేసుకున్నాడు. మన ప్రాచీన విగ్రహాలకు అత్యంత డిమాండ్ ఉంది విదేశాలలో దాంతో దాన్ని అడ్డుపెట్టుకొని 20 వేలకు పైగా విగ్రహాలను దొంగిలించాడు. అందులో 3000 కు పైగా విగ్రహాలు మన భారత్ కు చెందినవి కావడం గమనార్హం. దేవాలయాలకు మహర్దశ పట్టించిన సేవకుడు …… నాయకుడు మోడీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దాంతో మన దేశ గౌరవం మరింతగా ఇనుమడించేలా భారత్ ఆస్థి అయిన ప్రాచీన విగ్రహాలను తిరిగి భారత్ కు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు మోడీ. దేశాభివృద్ధి కోసం , నవ భారత నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు మోడీ. ఒకపుడు భారత్ లో ఆదాయపు పన్ను కట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. దేశ అభివృద్ధిలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే కీలకం కాబట్టి GST రూపంలో మార్పులు తెచ్చాడు….. అంతేకాదు ఆదాయపు పన్ను కట్టే ప్రజల సంఖ్యను కూడా గణనీయంగా పెరిగేలా చేసిన ఘనత కూడా మోడీ సొంతమే అని చెప్పాలి.
మెట్రో రైళ్లను , పెద్ద ఎత్తున జాతీయ రహదారులను , రైల్వే , ఎయిర్ పోర్ట్ లను మరింతగా ఆధునీకరించే గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. 140 కోట్ల మంది భారతీయుల కోసం……. అభినవ భారత్ కోసం ….. సమగ్ర అభివృద్ధి కోసం ప్రతీ రోజూ 18 నుండి 20 గంటల పాటు కష్టపడుతున్నాడు మోడీ. అందుకే అంటోంది భారత్ జయహో మోడీ.