
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట లోని ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు మోడీ. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మోడీకి ఘనస్వాగతం లభించింది. గవర్నర్ తమిళ్ సై , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్ , సాయం బాబూరావు, ధర్మపురి అరవింద్ తదితరులు మోడీకి స్వాగతం పలికిన వాళ్లలో ఉన్నారు. ఇక బండి సంజయ్ దగ్గరకు రాగానే అతడి చేతులను గట్టిగా పట్టుకొని నీకు అండగా నేనున్నాను అంటూ బలమైన సంకేతాలు ఇచ్చారు మోడీ.
బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకొని వందే భారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వందే భారత్ ట్రైన్ లోకి వెళ్లి పిల్లలతో కలిసి ముచ్చటించారు. వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుండి తిరుపతి కి ప్రతీ రోజు వెళ్లనుంది. కేవలం 8 గంటల 30 నిమిషాల్లోనే సికింద్రాబాద్ నుండి తిరుపతి కి చేరుకోనుంది ఈ ట్రైన్. ఇక తెలంగాణలో 11,300 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేయనున్నారు మోడీ.






