దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి దాంతో కలకలం చెలరేగింది. ఒకవైపు కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండగా ఢిల్లీ ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రజల్లో సీరియస్ నెస్ లేకుండాపోయింది దాంతో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి.
ఇక మంకీ పాక్స్ కేసుల విషయానికి వస్తే …… కేరళలో తొలి కేసు నమోదు కాగా తాజాగా మరోసారి ఢిల్లీ లో మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. దాంతో మనదేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన మంకీ పాక్స్ కేసుల సంఖ్య 5 కు చేరుకుంది. 24 ఏళ్ల ఓ మహిళకు మంకీ పాక్స్ లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.