భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో అందునా హిందువుల పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ ఆధ్వర్యంలో హనుమంతుడి విగ్రహం ముందు మహిళల బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించి అపచారం చేసారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడి విగ్రహం ముందు మహిళల చేత బికినీ షో చేయించారని , వెంటనే క్షమాపణ చెప్పాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
మహిళల చేత బాడీ బిల్డింగ్ పోటీలను ఈనెల 4 , 5 తేదీలలో నిర్వహించింది బీజేపీ పార్టీ. బీజేపీ నాయకుల సమక్షంలో జరిగిన ఈ పోటీలలో మహిళల వస్త్రధారణ వివాదాస్పదం అయ్యింది. మహిళలు బికినీలు వేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్నీ అస్త్రంగా చేసుకుంది. హనుమాన్ విగ్రహాన్ని గంగా జలాలతో అభిషేకించింది. అంతేకాదు మహిళలను చులకన చేసి అసభ్యంగా చూపించారని దుయ్యబట్టారు. అయితే మహిళల అభ్యున్నతి కోసం …… వాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం కలిగించడం కోసమే బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించామని , అంతేకాని మహిళలను కించపరచడానికి కాదని అంటున్నారు. మొత్తానికి ఈ విషయం మధ్యప్రదేశ్ లో పెద్ద వివాదంగా మారింది.