భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ – నీతా అంబానీ దంపతుల కుమారుడు ” అనంత్ అంబానీ ” ఎంగేజ్ మెంట్ రాధిక మర్చంట్ తో జరిగింది. రాజస్థాన్ లోని శ్రీనాథ్ ఆలయంలో అంబానీ కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ నిశ్చితార్థం జరిగింది. షైలా – వీరేన్ మర్చంట్ ల కుమార్తె ” రాధిక ”. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకుంది రాధిక.
ఇక అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ లో ఉన్నత చదువులు చదివారు. రిలయన్స్ లో అలాగే జియో సంస్థల్లో వివిధ హోదాలలో పనిచేసారు. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అనంత్ – రాధిక ల ప్రేమ కు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు ( డిసెంబర్ 29 న ) వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇక త్వరలోనే అనంత్ – రాధిక ల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగనుంది.