
కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా విలయాన్ని సృష్టిస్తోంది. కరోనా కేసులు మరోసారి పెరిగిపోతుండటంతో భారత్ అప్రమత్తమైంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో మనమే టాప్ అనే విషయం తెలిసిందే. దాంతో కరోనా కలవరపెడితే …… పరిస్థితులు అదుపు తప్పితే భారత్ లాంటి దేశం కోలుకోవడం కష్టమే ! అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది భారత్ ప్రభుత్వం.
అందుకే బూస్టర్ డోస్ లను నూటికి నూరు శాతం తీసుకునేలా సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా నాసల్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నాసల్ వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా …….. 800. అవును అక్షరాలా ఎనిమిది వందల రూపాయలుగా ఖరారు చేసారు. భారత్ బయోటిక్ ఈ నాసల్ వ్యాక్సిన్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతుండటంతో బూస్టర్ డోసులకు డిమాండ్ పెరిగింది.