వివాదాస్పద స్వామి నిత్యానంద వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవడమే కాదు అడపా దడపా మంచి మంచి సలహాలు ఇస్తూనే ఉంటాడు. అంతేకాదు జీవిత సత్యాలను అలాగే తత్వబోధన కూడా చేస్తుంటారు. ఒకానొక సందర్భంలో నిత్యానంద స్వామి చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఈ నిత్యానందుడు చెప్పిన సత్యాలు ఏంటో తెలుసా …….
అందం గురించి అలాగే మనిషిలోని పాజిటివిటి గురించి. మనకు మనం అద్దంలో చూసుకొని చాలా అందంగా ఉన్నామని అనుకుంటాం….. కానీ అది శుద్ధ దండగ ఎందుకంటే మన అందం గురించి బయటి వాళ్ళు చెప్పాలి. అలాగే మనం చాలా పాజిటివ్ వ్యక్తిత్వం గల వాళ్లమని మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు మన చుట్టూ ఉన్నవాళ్లు ఆ విషయం చెప్పాలి. అప్పుడే మనలో పాజిటివిటి ఉన్నట్లు లెక్క అని చక్కగా వివరించి చెప్పాడు నిత్యానంద స్వామి.
స్వామి నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. అయితే నిత్యానంద పరమశివం గా తన పేరును మార్చుకొని తన పేరునే ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి దేశ విదేశాలలో ఆలయాలు , గురుకులాలు , ఆశ్రమాలు ఏర్పాటు చేసాడు. హిందూ గురువుగా మొదట్లో మంచి పేరు ప్రఖ్యాతులే లభించాయి. అయితే అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. దాంతో పలు కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈక్వెడార్ ప్రాంతంలో ”కైలాస దేశం ” ను స్థాపించాడు. ఆ దేశానికి నేనే ప్రధాని అని ప్రకటించుకున్నాడు. కైలాస దేశాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరాడు నిత్యానందుడు.