30.1 C
India
Sunday, April 19, 2026
More

    కేసీఆర్‌ను దేక‌ని విప‌క్షాలు..!

    Date:

    KCR Shocked with latest survey
    KCR Shocked with latest survey

    ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన త‌ర్వాత దేశ వ్యాప్తంగా చాలా దూకుడుగా వెళ్తాడ‌ని అంద‌రం భావించాం. అనుకున్న‌ట్లే కేసీఆర్ కూడా భారాస తొలి స‌భ‌ను ఖ‌మ్మం పెట్టారు. ఈ మీటింగ్‌కు ముగ్గురు ముఖ్య‌మంత్రుల‌ను పిలిచి కాస్తా హ‌డావుడి చేశారు. అయితే ఆ త‌ర్వాత మాత్రం ఆ దూకుడు క‌నిపించ‌డం లేదు. ఎప్పుడు ఊ అంటే మ‌హారాష్ట్ర‌లో మాత్ర‌మే స‌భ‌లు పెడుతున్నారు.కానీ,ఇత‌ర రాష్ట్రాల సంగ‌తిని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

    ఇక తొలుత ఈయ‌న దూకుడును చూసిన విప‌క్ష నేత‌లు కూడా కేసీఆర్‌ను కాస్తా న‌మ్మారు. మొద‌ట ఈయ‌న పిలిచిన కార్య‌క్ర‌మాల‌కు కూడా అటెండ్ అయ్యారు.  తెలంగాణ కొత్త స‌చివాల‌య శంఖుస్థాప‌న చేసిన‌ప్పుడు కూడా విప‌క్షాల‌కు చెందిన కీల‌క నేత‌లు హైద‌రాబాద్ వ‌చ్చారు. కేసీఆర్‌తో క‌లిసి ప‌ని చేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. అయితే కేసీఆర్‌కు ఈస్థాయిలో విప‌క్ష నేత‌లు స‌హ‌క‌రించిన‌ప్ప‌టికీ .. ఆయ‌న మాత్రం వారి ఆహ్వానాల‌ను ప‌ట్టించుకోలేదు.

    ఈ నేప‌థ్యంలోనే విప‌క్ష నేత‌లు కూడా కేసీఆర్‌ను లైట్ తీసుకుంటున్నారు. ఇటీవ‌ల నితీశ్ కుమార్ ప‌లువురు కీల‌క విప‌క్ష నాయ‌కుల‌తో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ మీటింగ్‌కు బీజేపీయేత‌ర పార్టీల‌న్నింటికి నితీశ్ ఆహ్వానం పంపారు.కానీ,కేసీఆర్‌కు మాత్రం ఇన్విటేష‌న్ అంద‌లేదు. అలాగే స్టాలిన్ కూడా ఇటీవ‌ల త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ను చెన్నైలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు.

    ఈవేడుక‌ల‌కు దేశంలోని అన్ని పార్టీల నేత‌ల‌కు ఆహ్వానాలు పంపారు. కేసీఆర్‌కు మాత్రం పంప‌లేదు. కేసీఆర్‌ను అస్స‌లు కేర్ కూడా చేయ‌లేదు. మ‌రోవైపు టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కేసీఆర్‌ను ఇప్ప‌టికే ప‌ట్టించుకోవ‌డం మానేశారు. వీర‌ద్ద‌రికి రాబోయే ఎన్నిక‌ల్లో అవ‌స‌ర‌మైన ఫండింగ్ చేస్తాన‌ని కేసీఆర్ చెప్పిన‌ప్ప‌టికీ..వారు మాత్రం ఆయ‌న‌ను దేక‌డం లేదంటా..! ఇందుకు ప్ర‌ధాన కార‌ణం కేసీఆర్ స్ప‌ష్ట‌మైన రాజ‌కీయాలు చేయ‌క‌పోవ‌డ‌మేన‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారంటా..!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakalamma : మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదం

    కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూత Sakalamma : తెలంగాణ మాజీ...

    Supreme Court : ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్.. పిటీషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

    Supreme Court : ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీకి షాక్...

    High Court : బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చండి.. హైకోర్టు కీల‌క ఆదేశాలు

    High Court Order : భారత రాష్ట్ర సమితికి సంబంధించి పార్టీ...

    KCR : సార్లంతా ఫుల్ బిజీ.. ‘కారు’ స్టీరింగ్ పట్టేవారేరి?

    KCR  : ఒక ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన కర్తగా...