భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన భారత్ లో మాత్రమే నెంబర్ వన్ నేత కాదు సుమా ! ప్రపంచ నేతల్లోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. తాజాగా అమెరికాలోని ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ సంచలన నిజం వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులపై మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. కాగా ఆ సర్వేలో అందరికంటే ఎక్కువగా 75 శాతం ఓట్లు సాధించి నెంబర్ వన్ గా నిలిచారు మోడీ.
ఇక ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో అధ్యక్షులు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపేజ్ ఓబ్రడార్ 63 శాతం ఓట్లు సాధించారు. ఇక మూడవ స్థానంలో 53 శాతం ఓట్లతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగీ ఉండగా నాల్గో స్థానంలో కెనడా అధ్యక్షులు జస్టిస్ ట్రూడో ఆ తర్వాతి స్థానంలో జపాన్ ప్రధాని పుమియో కీషీద ఉన్నారు. దేశంలో ఒకవైపు మోడీ ప్రభావం కాస్త తగ్గుతోంది అని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ప్రజాధారణ పొందిన నాయకుడిగా మోడీ నిలవడం విశేషం అనే చెప్పాలి.