
ఢిల్లీ లిక్కర్ స్కామ్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను విచారిస్తుండటంతో అసలు ఈడీ కి ఉన్న అధికారాలు ఏంటి ? సెక్షన్ – 50 ఏం చెబుతోంది అనే చర్చ సాగుతోంది. సీబీఐ , IT డిపార్ట్ మెంట్ ల కంటే ఈడీ కి ఎందుకు అదనపు అధికారాలు ఉంటాయి ? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా ? తదితర విషయాలను తెలుసుకుందాం.
రాజకీయాల్లో ఉన్నవాళ్లు సాధారణంగా పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా భయపడరు …… ఎన్ని కేసులు పెట్టుకున్నా వెనకడుగు వేసేది లేదని ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే అలాంటి వాళ్ళు పోలీస్ కేసులకు , సీబీఐ కేసులకు భయపడరు అనుకుంటా …… కానీ ఈడీ కేసు అంటే మాత్రం వణికిపోతారు ఎందుకంటే ఈడీ రెండు చట్టాలపై ప్రధానంగా పని చేస్తుంది.
ఒకటి FEMA కాగా మరొకటి PMLA . ఫెమా అంటే foregin exchange management act – 1999 . ఇది సివిల్ చట్టం. ఫెమా లో ఫారిన్ ఎక్చేంజ్ కరెన్సీలో అవకతవకలు జరిగితే కేసు నమోదు చేయడమే కాకుండా అదుపులోకి తీసుకుంటారు. ఇక PMLA అంటే ….. prevention of money laundering act – 2002. ఇది క్రిమినల్ చట్టం. చట్టానికి వ్యతిరేకంగా బ్లాక్ మనీని వైట్ గా చూపించుకునే వాళ్ళ ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేయడమే ఈడీ ప్రధాన కర్తవ్యం.