
ఈనెల 26 న శ్రీశైలం మహా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేంద్ర టూరిజం శాఖ శ్రీశైలం దేవస్థానం ప్రసాదం స్కీమ్ ప్రవేశపెడుతోంది. కాగా ఆ స్కీమ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈనెల 26 న ఢిల్లీ నుండి వచ్చి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకోనున్నారు. తొలుత భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ప్రసాదం స్కీమ్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి వస్తుండటంతో శ్రీశైలం లో భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.