
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి రాకతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 100 ఎస్సైలు , 60 మంది సీఐ లు , 25 మంది డీఎస్పీ లు , ఎస్పీ స్థాయి అధికారులతో పాటుగా దాదాపు వెయ్యి మంది పోలీసులతో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రపతికి తెలంగాణ మంత్రులు జగదీష్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలకడం విశేషం. ఇక ఆలయ అధికారులు, అర్చకులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మీ నరసింహుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.






