
Q net కేసులో ఈడీ దిమ్మతిరిగే షాకిచ్చింది. 50 బ్యాంకులలో ఉన్న 137 కోట్లను ఫ్రీజ్ చేసింది ఈడీ. క్యూ నెట్ పై దేశ వ్యాప్తంగా 38 కేసులు నమోదయ్యాయి. ప్రజల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన క్యూనెట్ నిర్వాహకులు ప్రజలను నట్టేట ముంచారు. దాంతో దేశ వ్యాప్తంగా 38 చోట్ల కేసులు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో అప్పటి సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ క్యూనెట్ స్కామ్ నిందితులను అరెస్టు చేశారు. క్యూనెట్ స్కామ్ ను వెలుగులోకి తెచ్చింది సజ్జనార్ కావడం గమనార్హం.
అయితే సజ్జనార్ తీసుకున్న చర్యల వల్ల క్యూనెట్ కార్యకలాపాలు హైదరాబాద్ లో సద్దుమనిగాయి. కట్ చేస్తే క్యూనెట్ లీలలు మళ్లీ సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం సంఘటనతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరుగగా ఆ సంఘటనలో ఆరుగురు చనిపోయారు. అలా చనిపోయిన వాళ్ళు క్యూనెట్ లో పని చేస్తున్న సిబ్బంది కావడం గమనార్హం. దాంతో ఈడీ మళ్లీ హైదరాబాద్, బెంగుళూరు లలో తనిఖీలు చేపట్టింది. ఆ తనిఖీల తర్వాత క్యూనెట్ కు చెందిన 137 కోట్లను ఫ్రీజ్ చేసింది.






