
తన లోక్ సభ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటరీ రద్దు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన వ్యాఖ్యల పట్ల సూరత్ కోర్టు తీవ్ర అభ్యంతరం చెబుతూ రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు.
అయితే కోర్టు అలా జైలు శిక్ష విధించిందో లేదో ఇలా లోక్ సభ సభ్యత్వాన్ని కేంద్ర పెద్దల ఒత్తిడితోనే రద్దు చేసారని, జైలు శిక్ష అనుభవించిన వాళ్ళ పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు కానీ శిక్ష మాత్రమే విధించారని , ఆ కేసు తీర్పు మీద అప్పీల్ కు వెళ్ళడానికి నెల రోజుల సమయం కూడా ఉందని , అయినప్పటికీ కేంద్రం మాత్రం అత్యుత్సాహంతో తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసి తన హక్కులను కాలరాస్తున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు రాహుల్. ఇక దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి…… రాహుల్ గాంధీ విషయంలో మోడీ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ కు మద్దతుగా 15 పార్టీలు సైతం సుప్రీం తలుపు తడుతున్నాయి.






