
Rahul Gandhi Truck Ride : సెక్యూరిటీ లేకుండా అర్థరాత్రి ట్రక్కులో ప్రయాణం చేసిన రాహుల్ గాంధీ అర్థరాత్రి సమయంలో మీడియాకు, కార్యకర్తలకు తెలియకుండా డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అర్థరాత్రి ట్రక్కు ప్రయాణం చేసిన రాహుల్ గాంధీ.
కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఓసారి సాధారణ ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రచారం చేశారు. మరో రోజు డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ప్రచారం చేశారు. ఇక రీసెంట్ గా రాహుల్ గాంధీ తాను చదువుకున్న ఢిల్లీ యూనివర్సిటీ కి వెళ్లి విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటూ వారితో ఆలోచనలను పంచుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.
ఈ పాదయాత్ర ద్వారా కూడా రాహుల్ గాంధీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పాదయాత్రలో సామాన్యులతో మమైకమైన తీరును ప్రశంసించాల్సిందే. సామాన్యులతో ముచ్చటిస్తూ వారితో కలిసి భోజనం చేస్తూ రాహుల్ ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు. ఇక తాజాగా రాహుల్ గాంధీ మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అర్ధరాత్రి ట్రక్కులో ప్రయాణం చేశాడు. అర్ధరాత్రి సమయంలో కార్యకర్తలకు తెలియకుండా డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రాహుల్ ప్రయాణం చేశాడు.