భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుండి రూర్కీ కి కారులో బయలుదేరాడు రిషబ్ పంత్. అత్యంత వేగంగా బెంజ్ కారులో వెళుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారులో మంటలు ఎక్కువ కావడంతో కారు అద్దాలను పగులగొట్టి అందులోంచి బయటకు వచ్చాడు రిషబ్.
ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రిషబ్ పంత్ కారు వేగంగా డివైడర్ ను ఢీకొట్టడం …… కారు దగ్ధం కావడం , బయటకు వచ్చిన రిషబ్ గాయాల పాలయిన విజువల్స్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రిషబ్ కారు భారీ యాక్సిడెంట్ కు గురైన దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగుర్పొరిడిచేలా ఉన్నాయి. ఆ స్థాయి యాక్సిడెంట్ చూస్తే రిషబ్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. అయితే తలకు , వీపుకు గాయాలయ్యాయి అలాగే కాలు విరిగింది. పూర్తి స్థాయిలో రిషబ్ పరిస్థితి ఏంటి ? అన్నది వివరాలతో వెల్లడిస్తామని ప్రకటించారు రూర్కీ వైద్యులు.
ऋषभ पंत की कार का CCTV आया सामने…ऋषभ पंत कार खुद चला रहे थे.ईश्वर उन्हें जल्दी ठीक करे. @RishabhPant17 #Rishabpant pic.twitter.com/ien2JNtLba
— Rahul Sisodia (@Sisodia19Rahul) December 30, 2022
#BREAKING
Indian The King Cricketer Rishabh Pant’s car has met with a terrible #Accident at Delhi-Dehradun road, #Uttarakhand.My God Get Well Soon Speed Recovery. #Rishabpant ऋषभ पंत pic.twitter.com/Y9puIjxcn7
— 🦋 Tara Sharma 🦋 💯 Follow Back ❤️ (@sharma97tara) December 30, 2022