మనం సాధారంణగా ప్రయాణాల్లో కానీయండి లేదా ఇతర ఫంక్షన్ లలో పెద్ద ఎత్తున బిస్ లరీ , కిన్ లే తదితర వాటర్ బాటిల్స్ కొంటుంటాం. అయితే అలా ఆ బాటిల్స్ కొనడం వల్ల ఇతర దేశాల వాళ్ల జేబుల్లోకి పెద్ద ఎత్తున భారత్ డబ్బు వెళుతోంది. దాంతో మన ఆర్ధిక వ్యవస్థకు కూడా పెద్దగా ఉపయోగపడటం లేదు. ఇలా ప్రతీ ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలు భారత్ సొమ్ము విదేశాల పరం అవుతోంది దాంతో దానికి అడ్డుకట్ట వేయడానికి ఆర్మీ నడుం బిగించింది. అలా వచ్చిన ఆలోచనే ” సేనా జల్ ”. ఆర్మీ వాటర్ అనే పేరు.
ఇటీవల మేజర్ జనరల్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ ఈ ” సేనా జల్ ” కు శ్రీకారం చుట్టారు. సేనా జల్ హాఫ్ లీటర్ , వన్ లీటర్ బాటిల్స్ రూపంలో లభ్యమౌతోంది. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కు 6 రూపాయలు కాగా వన్ లీటర్ బాటిల్ కు కేవలం 10 రూపాయలు మాత్రమే.
ఇదే ఇతర సంస్థలకు చెందిన వాటర్ బాటిల్స్ ఖరీదు 20 రూపాయలుగా ఉంది. సేనా జల్ వాటర్ బాటిల్స్ కొనడం వల్ల దాని ద్వారా వచ్చిన సొమ్ము ఆర్మీ కోసం అలాగే ఆర్మీ పిల్లల భవిష్యత్ కోసం వినియోగిస్తారు. అంటే సేనా జల్ వాటర్ బాటిల్ కొనడం వల్ల దేశ సేవలో మనం కూడా ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం అన్నమాట. అందుకే సేనా జల్ వాటర్ బాటిల్ కొనండి ……. ఆర్మీకి అండగా నిలవండి. జైహింద్.