మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్ ( 75 ) గురువారం రాత్రి మరణించారు. ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికైన శరద్ యాదవ్ మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1947 జూన్ 1 న జన్మించిన శరద్ యాదవ్ ఎమర్జెన్సీ నేపథ్యంలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1974 లో లోక్ సభకు ఎన్నికయ్యారు. జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా పేరుగాంచారు. కేంద్ర మంత్రివర్గంలో పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు శరద్ యాదవ్.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ ను ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనవరి 12 రాత్రి 10 గంటల తర్వాత శరద్ యాదవ్ మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. శరద్ యాదవ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ , కాంగెస్ యువ నాయకులు రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.