36.5 C
India
Friday, April 10, 2026
More

    షిర్డీలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట కథేంటో తెలుసా ?

    Date:

    shirdi sai baba marble statue story
    shirdi sai baba marble statue story

    షిరిడీలో కొలువై ఉన్న పవిత్ర దేవాలయం ” షిరిడీ సాయి బాబా ” ఆలయం. షిరిడి సాయి ఎక్కడ నుండి వచ్చాడు , జననం ఏంటి? అన్నది పూర్తిగా తెలియనప్పటికీ 1854 లో మాత్రం షిరిడీలో మొదటిసారి అడుగుపెట్టాడు సాయిబాబా. సాయిబాబాను  అటు ముస్లిం లు ఇటు హిందువులు పూజించారు. అయితే ఎక్కువగా ఇప్పుడు హిందువుల ఆరాధ్య దైవం అయ్యాడనే చెప్పాలి.

    1918 అక్టోబర్ 15 న షిరిడి సాయిబాబా పరమపదించిన విషయం తెలిసిందే. దాంతో సాయిబాబాను దేవుడిగా కీర్తిస్తూ అతడికి గుడి కట్టాలని భావించారు. సాయిబాబా సమాధినే గుడిగా మలిచారు. సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వెనుక ఓ చిన్న కథే ఉంది తెలుసా ……అదేంటో తెలుసా ….  సాయిబాబా షిరిడి లో అడుగుపెట్టిన వందేళ్లకు అంటే ఆయన 1854 లో షిరిడి లో అడుగు పెట్టగా …… 1954 లో విగ్రహం ప్రతిష్టించారు.

    ఇందుకోసం ముంబైకి చెందిన శిల్పి బాలాజీ వసంత తాలిమ్ ను పిలిపించారు. అయితే సాయిబాబా పాలరాతి విగ్రహానికి మరో విశిష్టత ఉంది తెలుసా ……. అదేంటంటే …….. ఇటలీ నుండి పాలరాయిని ఎవరో ముంబైకి తెప్పించారు. అయితే నౌకాశ్రమం నుండి ఆ పాలరాయిని ఎవరూ తీసుకుపోవడానికి రాకపోయేసరికి ఆ పాలరాయిని వేలం వేశారు. దాంతో ఒకరు ఈ పాలరాయిని వేలంలో పాడి షిర్డీ సంస్థాన్ కు ఇచ్చాడు.

    పాలరాయితో సాయిబాబా విగ్రహాన్ని చెక్కించాలని భావించి బాలాజీ వసంత తాలిమ్ ను పిలిపించారు. అయితే సాయిబాబా ఆకారానికి చెందిన నమూనాలు ఏవి లేకపోవడంతో బాలాజీ వసంత తాలిమ్ సాయిబాబాను ఆర్థిగా ప్రార్ధించాడు. అంతే …. స్వప్నంలో సాయిబాబా సాక్షాత్కరించాడట. మరోసారి కనబడును కాబట్టి ఇప్పుడే సరిగ్గా చూసుకో అన్నాడట. దాంతో సాయిబాబా ను తీక్షణంగా చూశాడట తాలిమ్.

    ఇంకేముంది తన స్వప్నంలో కన్పించిన సాయిబాబా రూపాన్ని చెదిరిపోకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో నమూనా విగ్రహాన్ని చేసాడట తాలిమ్. ఆ తర్వాత ఆ నమూనా విగ్రహం చూస్తూ ఈ పాలరాయి విగ్రహాన్ని చెక్కాడు. ఇంకేముంది ఆ రూపం సజీవంగా ఉంది. కోట్లాది మంది భక్తులను అలరిస్తోంది. ఇదన్న మాట అసలు సంగతి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related