
మేలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మే 10న ఎన్నికలు జరుగుతుండగా 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ” పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ” సర్వే నిర్వహించింది.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 95 నుండి 105 గెలుచుకుంటుందని , బీజేపీ 90 నుండి 100 సీట్లు గెలుచుకుంటుందని ఇక కుమారస్వామి జేడీఎస్ కు 25 నుండి 30 సీట్ల మధ్య వస్తాయని ఫలితాలను వెల్లడించింది. అంటే కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 113 స్థానాలు ఏ రాజకీయ పార్టీకి రావడం లేదు. దాంతో జేడీఎస్ కీలకం కానుంది.
కాంగ్రెస్ పార్టీ – బీజేపీ హోరాహోరీగా తలపడనున్నాయి. ఎవరికీ సరైన మెజారిటీ రాదని ఆ సర్వే వెల్లడిస్తోంది. దాంతో అవసరమైన మెజారిటీ కోసం జేడీఎస్ మీద లేదంటే ఇండిపెండెట్ల మీద ఆధారపడాల్సి రావచ్చు.






