నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల రద్దును అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమర్ధించింది. 2016 లో 1000, 500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశ భవిష్యత్ కోసం , బ్లాక్ మనీని అరికట్టడానికి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు మోడీ. అయితే పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ మొత్తం 58 పిటిషన్లు నమోదయ్యాయి.
పెద్ద నోట్ల రద్దు మోడీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అంటూ సుప్రీం ను ఆశ్రయించారు. అయితే పెద్ద నోట్ల రద్దు పిటిషన్ లను విచారణకు స్వీకరించిన సుప్రీం అందరి వాదనలు విన్న తర్వాత ఈరోజు తన తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు ఏమాత్రం తప్పుడు నిర్ణయం కాదని , ముందే అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించిన తర్వాతే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమర్ధించింది. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ లను కొట్టేసింది. సుప్రీం తీర్పుతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్షాలు కూడా మోడీపై దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే.