28.5 C
India
Friday, March 21, 2025
More

    ఈనెల 26 నుండి 30 వరకు భారత రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ లోబస

    Date:

    The President of India will be in Hyderabad from 26th to 30th of this month
    The President of India will be in Hyderabad from 26th to 30th of this month

    పత్రికా ప్రకటన
    హైదరాబాద్, డిసెంబర్ 16 :: దక్షిణాది పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో జరిపే ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము, రామప్ప, భద్రాచలాన్ని సందర్శిస్తారు. అలాగే హైదరాబాద్ నగరంలో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు రామచంద్ర మహారాజ్ 150 జయంతి ఉత్సవాల ను ప్రారంభిస్తారు.

    దీనికి గుర్తుగా హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్ ప్రచార ఫలకం ఆవిష్కరణలో కూడా ఆమె పాల్గొంటారు.
    రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విడిది కోసం చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు బిఆర్‌కెఆర్‌ భవన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు.
    రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని, ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని పలు శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

    రాష్టప్రతి మార్గంలో రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్‌ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవోలను ఆదేశించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రపతి నిలయంలో ప్రొటోకాల్‌ అనుసరించి 24 గంటల పాటు విద్యుత్తు శాఖ, వైద్య బృందాలను నియమించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. కాగా, 2023 జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో నిర్వహించనున్న శ్రీరామచంద్రజీ మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు.

    ఈ ఉత్సవాలకు దేశ, విదేశాలనుండి నుంచి లక్ష మందికి పైగా యాత్రికులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, ఇందుకు గాను ఏవిధమైన లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

    Share post:

    More like this
    Related

    Rajamouli : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళికి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…

    Rajamouli : దర్శకుడు రాజమౌళికి మహేష్ బాబు నటించిన సినిమాల్లో 'ఒక్కడు' మరియు...

    Court : 6 రోజుల్లో 8 లక్షల టిక్కెట్లు… ‘కోర్ట్’ సినిమాకు ఎంత వసూలైందంటే!

    Court Movie : 'కోర్ట్' సినిమా విడుదలైన ఆరవ రోజున తెలుగు రాష్ట్రాల్లో...

    Shekhar Master : శేఖర్ మాస్టర్‌పై మహిళా కమిషన్ ఫైర్

    Shekhar Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన పాటలలో పెడుతున్న...

    Mahesh Babu : నిర్మాతలను ఆదుకుంటున్న ఏకైక హీరో మహేష్ బాబు

    Mahesh Babu : దర్శకుడు రాజమౌళితో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Droupadi Murmu : మహిళలకు దేశం గర్వించేలా చేస్తున్నారు.. రాష్ట్రపతి ముర్ము

    Droupadi Murmu : మహిళా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి...

    యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి

    యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి...

    రాష్ట్రపతిని వేడుకున్న పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే....