
H3N2 Virus భారత్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఈ వైరస్ ఎక్కువగా నమోదు అవుతోంది. అయితే తాజాగా ఈ వైరస్ బారిన పడి ఇద్దరు మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. H3N2 వైరస్ వల్ల ఎలాంటి ప్రాణహాని లేదని చెబుతున్నప్పటికీ తాజాగా ఇద్దరు ఇదే వైరస్ తో మరణించడం సంచలనం సృష్టిస్తోంది.
హర్యానాలో ఒకరు అలాగే కర్ణాటకకు చెందిన ఒకరు H3N2 Virus తో మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్ కు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలే H3N2 వైరస్ పట్ల తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు అలాగే కేంద్ర ప్రభుత్వం. తుమ్ములు , జలుబు , తలనొప్పి , జ్వరం , ఒళ్ళు నొప్పులు , వాంతులు , విరోచనాలు , రుచి , వాసన కోల్పోవడం తదితర కరోనా లక్షణాలే ఈ వైరస్ కు ఉన్నాయని , వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. శ్వాసకోశ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు.