ఈరోజు ఉదయం 9.30 గంటలకు వర్చువల్ గా వందేభారత్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అసలు ఈనెల 19 న ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించాల్సి ఉంది. అయితే చెన్నై నుండి సికింద్రాబాద్ కు వస్తున్న వందేభారత్ ట్రైన్ ను కంచెరపాలెంలో కొంతమంది ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దాంతో రెండు భోగీలు దెబ్బతిన్నాయి.
దాంతో ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడింది. అయితే వందేభారత్ ట్రైన్ లో దెబ్బతిన్న భాగాలను సరిచేశారు. దాంతో ఈనెల 15 న అంటే ఈరోజున ఉదయం 9.30 గంటలకు వర్చువల్ గా ఈ కొత్త ట్రైన్ ను ప్రారంభిస్తున్నారు మోడీ. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసారు రైల్వే అధికారులు. ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్ నుండి వైజాగ్ కు వెళ్లనుంది. ఈరోజు సంక్రాంతి రోజున ప్రారంభం అవుతోంది కాబట్టి రేపటి నుండి రెగ్యులర్ గా వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కనుంది. దీంట్లో ప్రయాణించాలంటే కాస్త ఎక్కువ డబ్బులే ఖర్చు చేయాలి సుమా ! ఎందుకంటే మిగతా ట్రైన్ ల కంటే చాలా ఎక్కువే టికెట్ ధర.