35.9 C
India
Thursday, March 28, 2024
More

    అసలు వాటర్ మెట్రో ఏంటి..? మోడీ ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు?

    Date:

    water metro
    water metro
    వాట‌ర్ మెట్రో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పేరు,విధానం పెద్ద‌గా ప్రాచుర్యంలో లేదు. కానీ,ఇప్పుడు ద‌క్షిణాసియా లోనే తొలిసారి ఈ ప్రాజెక్టు ప‌నుల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప‌చ్చ‌జెండా ఊపారు. కేర‌ళ కోచ్చిలో కోచ్చి వాట‌ర్ స‌ర్వీసెస్‌కు మంగ‌ళ‌వారం పీఎం మోడీ శంకుస్థాప‌న చేశారు. ఈప్రాజెక్టు ప‌నుల‌ను రూ.1.136.86 కోట్ల వ్య‌యంతో చేప‌డుతున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వ‌స్తే కేర‌ళ రూపురేఖ‌లే మారిపోయే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.

    అస‌లేంటి ఈ ప్రాజెక్టు..?

    భార‌త్‌లో కేర‌ళ అనేది ప్ర‌కృతి అందాల‌కు నిల‌యం. ఇక్క‌డ ప‌శ్చిమ క‌నుమ‌లు ఉండ‌డం,స‌ముద్ర జ‌లాలు కేర‌ళ రాష్ట్రంలోకి చొచ్చుకురావ‌డంతో ఇక్క‌డ ప‌ర్యాట‌క రంగం బాగా అభివృద్ధి చెందింది. ఈ నేప‌థ్యంలోనే కేర‌ళ టూరిస్ట్‌ డెస్టినేష‌న్స్ ను మ‌రింత‌గా డెవ‌ల‌ప్ చేసేందుకు కోచి వాట‌ర్ మెట్రో స‌ర్వీసు ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్నో రోజులు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కోచ్చి వాట‌ర్ మెట్రో ప్రాజెక్టుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శంకుస్థాప‌న చేశారు. ఈప్రాజెక్టును కేర‌ళ స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్‌,జ‌ర్మ‌నీకి చెందిన కేఎఫ్‌డ‌బ్యూ క‌లిపి సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నా యి.

    కోచి వాట‌ర్ మెట్రో స‌ర్వీస్‌లో బ్యాట‌రీతో న‌డిచే 78 హైస్పీడ్ బోట్ల‌ను ఈ ప్రాజెక్టులో భాగంగా అందుబాటు లోకి తేనున్నారు. ఈ బోట్లు మొత్తం బ్యాట‌రీల‌తోనే న‌డిచేలా వీటిని రూపొందించ‌నున్నారు. కోచి చుట్టు ప‌క్క‌లున్న ఐలాండ్స్ ను కోచితో క‌నెక్ట్ చేసేందుకు ఈ బోట్లు ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. ఈ బోట్లు గంట‌కు 15 నుంచి 22 కిలో మీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌నున్నాయి. వీటిలో వైఫై సౌక‌ర్యాన్ని కూడా అందుబాటులో ఉండ‌నుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు పూర్తైతే కేర‌ళ రూపురేఖ‌లే మారిపోతాయ‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ చెబుతున్నారు. అందుకే మోడీ గ‌త కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన...

    Jagan-Modi : జగన్ మోడీకి లొంగిపోయి పన్ను భారాన్ని ప్రజలపై వేశారు..? 

    Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై...

    Odisha News : నిన్నటి వరకు ఉత్కంఠ.. నేడు ఎవరికి వారేనంట..

    Odisha News : మరోసారి కలిసి పోటీ చేయాలని భావించిన బిజద, భాజపాలు...

    Kunamneni : బెదిరింపులకు లొంగకపోవడంతోనే  అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.. కూనంనేని

    Kunamneni  : దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయడానికి బిజెపి...