వాట్సాప్ ఇండియా హెడ్ రాజీనామా కలకలం రేపుతోంది. గతకొంత కాలంగా ఆర్ధిక మాంద్యం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి పలు సంస్థలు. ఇప్పటికే ఆ బాటలో పలు సంస్థలు నడుస్తున్నాయి దాంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డు పాలవుతున్నారు. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఆ ప్రభావమో లేక సంస్థే తొలగించిందో కానీ వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తన పదవికి రాజీనామా చేసారు.
జుకర్ బర్గ్ ఇటీవల మెటా సంస్థ నుండి 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ 11 వేల మందిలో అభిజిత్ బోస్ కూడా ఒకరా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి అభిజిత్ బోస్ మాత్రం తన పదవికి రాజీనామా చేసారు. ఇండియాలో వాట్సాప్ సేవలు మరింతగా మెరుగయ్యేలా చేయడంలో అభిజిత్ బోస్ ది కీలక పాత్ర అనే చెప్పాలి.