
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ పై అధికార దాహంతో యుద్ధం ప్రకటించి వందలాదిమందిని పొట్టన పెట్టుకున్న నేరానికి గాను అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నట్లుగా ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. గత ఏడాది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగకుండా రష్యాను నిలువరించడానికి అంతర్జాతీయ సమాజం గట్టి ప్రయత్నాలే చేసింది. అయితే అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఎంతగా హెచ్చరించినప్పటికి పుతిన్ మాత్రం ఎవరినీ లెక్కచేయలేదు సరికదా …… మరింత ఒత్తిడి చేస్తే ఆయా దేశాలను తమ శత్రు దేశాలుగా పరిగణించాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసాడు దాంతో మిగతా దేశాలన్నీ గమ్మున ఉండిపోయాయి.
ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించి ఏడాది దాటినప్పటికి వందలాది మంది సైనికులు , వేలాదిగా పౌరులు మరణించినప్పటికి యుద్ధం మాత్రం ఆగలేదు. ఇంకా సాగుతూనే ఉంది. దాంతో అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ స్పందించింది. పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఉక్రెయిన్ సంతోషం వ్యక్తం చేస్తోంది. పుతిన్ ఇప్పటికే అంతర్జాతీయంగా రక్తం రుచి మరిగిన పులి గా ముద్ర పడ్డాడని , అతడికి మరిన్ని శిక్షలు పడాలని ……ఏ రోజుకైనా సరే అతడు శిక్షించబడతాడని ఉక్రెయిన్ భావిస్తోంది.