
సింగపూర్ సిస్టమేటిక్‌కు మారు పేరు. డిసిప్లెయిన్ కు కేరాఫ్ అడ్రస్. అలాంటి క్రమశిక్షణకు కేరాఫ్‌గా ఉన్న దేశంలో చిన్న తప్పులు జరిగిన శిక్షలు కఠినంగానే వేస్తుంటారు. ఇక భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తి కేవలం కిలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ..అక్కడి అధికారులకు పట్టుబడ్డారు.
2014లో గంజాయి తరలింపు కేసులో ఆదేశ పోలీసులు తంగరాజును అరెస్ట్ చేశారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నాడని అతనిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. దీంతో అతనిపై మోపబడిన ఆరోపణలపై సమగ్రవిచారణ జరిపిన సింగపూర్ ప్రభుత్వం అతడు నేరం చేసినట్లు తేల్చింది.
ఈ నేపథ్యంలోనే సింగపూర్ లోని కోర్టు అతడికి అక్టోబర్,2018లో మరణ శిక్ష విధించింది. అయితే సింగపూర్ నిర్ణయంపై ఆస్ట్రేలియాతో పాటు బ్రిటన్ తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి ఉన్మాద నిర్ణయాలు సరికాదని స్పష్టం చేశాయి. అయితే ఆ రెండు దేశాల అభ్యంతరాలను అస్సలు లెక్కలోకి తీసుకొని సింగపూర్ బుధవారం తంగరాజుకు విధించిన శిక్షను అమలు చేసింది. తద్వారా సింగపూర్‌లో ఎవరు తప్పు చేసినా..కఠిన చర్యలు తప్పవని నేరస్థులకు మరోసారి హెచ్చరికలు పంపింది.






