
వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడుగా అజయ్ బంగా నియమితులయ్యారు. ఇంతకీ ఈ అజయ్ బంగా ఎవరో తెలుసా ….. ఇంకెవరు మన భారతీయుడే. మహారాష్ట్ర లోని పుణేలో జన్మించారు అజయ్ బంగా. 63 ఏళ్ల అజయ్ బంగా శక్తి సామర్ధ్యాలకు తగిన బాధ్యత అప్పగించాలని భావించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సత్తా చాటుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలలో కీలక పదవులు మన భారతీయులు నిర్వహిస్తుండటం విశేషం. అజయ్ బంగా ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటికో వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో మాస్టర్ కార్డ్లో సీఈఓగా పనిచేసారు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగం దివాళా తీస్తున్న క్లిష్ట సమయంలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. దాంతో అజయ్ బంగా పై ప్రశంసల వర్షం కురుస్తోంది.