చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముచ్చటగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఈరోజు ( మార్చి 10 ) తో పదేళ్ల కాలం పూర్తి చేసుకుంటున్నాడు జిన్ పింగ్ . దాంతో ఈరోజునే ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. చైనాలో పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ మాత్రమే మూడు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసాడు. మావో తర్వాత అంతటి ఘనత జిన్ పింగ్ కు మాత్రమే దక్కింది.
చైనా కమ్యూనిస్ట్ లు పదేళ్లకు మించి ఎవరూ పదవిలో కొనసాగవద్దు అని తీర్మానించారు. అయితే జిన్ పింగ్ కోసం పార్టీ నియమాలను మార్చారు. దాంతో జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడు అవుతున్నాడు. చైనాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చేయాలని భావిస్తున్నాడు జిన్ పింగ్. మూడోసారి చైనా అధ్యక్షుడు అవుతున్న జిన్ పింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు.