India-Bharath: ప్రస్తుతం చర్చలు, రాజకీయాలు ‘ఇండియా-భారత్’ చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రెండు పేర్లపై తర్జన భర్జన అవుతున్నారు. బ్రిటీషర్స్ ను తరిమేసిన దాదాపు 70 సంవత్సరాల తర్వాత భారతదేశం పూర్తి ప్రక్షాళన అవుతుంది. ఈ సనాతన భూమిని తన బానిస ఛాయలు, గుర్తులు, మరకలను అంచెలంచెలుగా పూర్తిగా తెంచుకుంటుంది.
ఇప్పటికే బ్రిటీషర్స్ పెట్టిన రాజద్రోహం సెక్షన్ ను పూర్తిగా తొలగించారు. దీనితో పాటు ‘ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీఎస్)’ను ‘భారత్ పీనల్ కోడ్ (బీపీఎస్)’గా మార్చారు. ఇలాంటి మార్పులన దేశంలో అనేకం చేసిన బీజేపీ పార్టీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రపంచం యావత్తు ఆశ్చర్యానికి గురయ్య నిర్ణయం తీసుకోబోతోంది. అదే పేరు మార్పు.
ఇప్పటి వరకు ఇండియాగా ఉన్న పేరు ఇకపై భారత్ గా మార్చబోతోందన్న సంకేతాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పాజిటివ్ వే చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి పరిపూర్ణానంత చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ఏమన్నారంటే.
‘మనది ఇండియా కాదు.. భారత్. అసలు ఆ పేరుకు అర్థం ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా.. (Indipendent Natiion Declair In Augst-INDIA) అని వారు పేరు పెట్టారు. వాడెవడో స్వాతంత్రం డిక్లెయిర్ చేయడం లేంటి.. మనం కొట్లాడి సాధించుకున్నాం. వారిని తరిమేశాం. అప్పుడు వాడు INDIA పేరును పెట్టి వెళ్లిపోయాడు. బ్రిటీషర్స్ ఇక్కడికి రాకముందు INDIA పేరు లేదు. మనది ‘భారత్’. అమెరికా పేరుకు అర్థం లేదు.. ఆస్ట్రేలియా లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాల పేర్లకు అర్థం లేదు. కని భారత్ కు మాత్రం అర్థం ఉంది.
‘భారత్’ అంటే భా=జ్ఞానం, ర=రమించడం, త్(త)=తరించడం.. భారత్ అంటే జ్ఞానంలో రమించి తరించడం అన్నమాట. ఇక్కడ పుట్టిన వారు అందరూ జ్ఞానవంతులు అవుతారు. ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞానం ఇక్కడమాత్రమే దొరుకుతుంది అందుకు ఇది పుణ్య భూమి, ధన్య భూమి’ అన్నాడు పరిపూర్ణానంద.